కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఖలందర్ దాదాపు 10 ఏళ్ల నుంచి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అందరికంటే భిన్నంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న ఆయన కొత్త రకం పండ్లను ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. విదేశాల్లో పండే పండ్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాడు. చెన్నై, బెంగుళూరు నుంచి విదేశీ పండ్లను ప్రొద్దుటూరుకి తెచ్చి అమ్ముతున్నారు. వీటికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండడం వల్ల రెండు రోజులకోసారి పండ్లను తెప్పించి విక్రయిస్తున్నారు. ఫలాలు చెడిపోకుండా భద్రపరిచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో గల్ఫ్‌లో పనిచేసిన ఖలందర్ అక్కడ పండే పండ్లను ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తెస్తే వ్యాపారం బాగుంటుందనే నమ్మకంతోనే వాటిని విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.
అన్ని విదేశీ ఫలాలు అందుబాటులో
రామసీతా ఫలం, కివీ, అమెరికన్ ఆపిల్, రాయల్‌గల, గ్రీన్ ఆపిల్, పియర్స్, లిచీ, ఎర్రదాక్ష, ఇలా అన్ని రకాల విదేశీ పండ్లను ఖలందర్ విక్రయిస్తున్నాడు. సాధారణంగా మన ప్రాంతాల్లో సీతాఫలం లభ్యమైనా రామసీతాఫలం ఇక్కడ పండదు. జపాన్ ఆపిల్‌ను చాలా తక్కువ మంది చూసుంటారు. అంతే కాకుండా లాంగర్ పండు, గ్రీన్ ఆపిల్, ఎర్ర డ్రాగెన్, ఎరుపు రంగు కివీ ఇలా 20 రకాల విదేశీ పండ్లను ఖలందర్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.. వీటిని తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందనే ఉద్దేశంతో వైద్యులు కూడా ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నట్లు ఖలందర్ తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడి ప్రజలకు మరిన్ని కొత్త రకం పండ్లను పరిచయం చేస్తానని.. చెబుతున్నారు.
ప్రజలకు అందుబాటులో విదేశీ ఫలాలు తీసుకొచ్చిన వ్యాపారి ఇదీ చూడండి:
విదేశీ కొలువు వదిలి.. చిరుధాన్యాల సాగు పట్టి..