ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోరుమామిళ్ల చెరువుకు అంతర్జాతీయ పురస్కారం - International Award for Porumamilla Pond news

శ్రీకృష్ణదేవరాయల హయాంలో నిర్మించిన పోరుమామిళ్ల చెరువుకు ప్రపంచ చారిత్రక నీటి పారుదల కట్టడాల (వరల్డ్‌ హెరిటేజ్‌ ఇరిగేషన్‌ స్ట్రక్చర్స్‌) గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రెయినేజీ సంస్థకు (ఐ.సి.ఐ.డి) చెందిన న్యాయనిర్ణేతల బృందం అంతర్జాతీయంగా వచ్చిన ఎంట్రీలను పరిశీలించి ఎంపిక చేసింది. 2020 సంవత్సరానికిగానూ ప్రపంచంలోని 14 సాగునీటి ప్రాజెక్టులకు స్థానం లభించగా, ఇందులో భారతదేశంలో నాలుగింటికి అవకాశం లభించింది. వీటిలో కడప జిల్లా పోరుమామిళ్ల చెరువు ఉంది. అంతర్జాతీయ పురస్కారాన్ని ఈ నెల 7న వర్చువల్​ విధానంలో అందజేయనున్నారు.

International Award for Porumamilla Pond
డిసెంబర్ 7న పోరుమామిళ్ల చెరువుకు అంతర్జాతీయ పురస్కారం

By

Published : Dec 1, 2020, 12:33 PM IST

కడప జిల్లా పోరుమామిళ్ల చెరువుకు వరల్డ్‌ హెరిటేజ్‌ ఇరిగేషన్‌ స్ట్రక్చర్స్‌ గుర్తింపు లభించింది. 2020 సంవత్సరానికిగానూ ప్రపంచంలోని 14 సాగునీటి ప్రాజెక్టులకు స్థానం లభించగా, ఇందులో భారతదేశంలో నాలుగింటికి అవకాశం లభించింది. ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రెయినేజీ సంస్థకు (ఐ.సి.ఐ.డి) చెందిన న్యాయనిర్ణేతల బృందం అంతర్జాతీయంగా వచ్చిన ఎంట్రీలను పరిశీలించి ఎంపిక చేసింది. ఇందులో పోరుమామిళ్ల చెరువుకు స్థానం దక్కింది.

ఈ చెరువుకు 700 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. క్రీ.శ 1369 అక్టోబర్ 15వ తేదీన విజయనగరం ప్రభువైన మొదటి కుమారుడు భాస్కరుడు అనే ఉదయగిరి రాజ్యానికి అధిపతిగా ఉన్న రోజుల్లో ఈ చెరువును నిర్మించినట్లు ఇక్కడి శాసనం ద్వారా తెలుస్తోంది. 1903వ సంవత్సరంలో పరిశోధకులు ఈ శాసనంపై ఉన్న విషయాలను బహిర్గతం చేశారు. ఈ చెరువు 11 కిలోమీటర్లు పొడవు, 13 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తు కలిగి ఉందన్నారు. ఈ కట్ట అడుగుభాగం 150 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఆ రోజులలో వేయి మంది కూలీలు, నూరు ఎడ్లబండ్ల సహాయంతో రెండున్నర సంవత్సరాలు ఈ చెరువును నిర్మించినట్లు తెలుస్తోంది. పూర్వం అనంతసాగరంగా ఈ ప్రాంతాన్ని పిలువబడ్డారు. ప్రస్తుతం కాలక్రమంలో అది పోరుమామిళ్లగా పిలువబడుతోంది.

డిసెంబర్ 7వ తేదీన వర్చువల్ విధానంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

ఇదీ చదవండి:

కార్తిక పౌర్ణమి..పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికశోభ

ABOUT THE AUTHOR

...view details