నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కడప జిల్లాలో సుమారు 90 కేంద్రాలలో 24 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతియేటా రాయచోటి కేంద్రంగా పరీక్ష సమయంలో ఏదో ఒక అలజడి చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తుగా పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి - పకడ్బందిగా ఇంటర్ పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష గదిలో నిఘానేత్రాలను ఏర్పాటు చేశారు.
పకడ్బందిగా ఇంటర్ పరీక్షలు
ఇటీవల నియమితులైన సచివాలయ ఉద్యోగులను జిల్లా కేంద్రాలకు ఇన్విజిలేటర్లుగా వినియోగిస్తున్నారు. రాయచోటి కేంద్రంగా 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి గదిలోనూ నిఘా నేత్రాల ద్వారా పర్యవేక్షణ కొనసాగనుంది. దూర ప్రాంతాల విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. పరీక్షను తరచూ స్క్వాడ్ బృందాలు, హై పవర్ కమిటీ సభ్యులు తనిఖీ చేస్తారని ఉన్నత అధికారులు పేర్కొన్నారు.