కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ మానవత్వం చాటుకున్నారు. కరోనా బారినపడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పోలీసులకు వడ్డీలేని సులభ వాయిదాల పద్ధతిలో లక్ష రూపాయల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో జిల్లా పోలీసులకు వివిధ రకాల రాయితీలను ప్రకటించారు. జిల్లా పోలీసుల సంక్షేమానికి అనునిత్యం ఆయన తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. పోలీసుల కోసం ప్రత్యేకంగా కొవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డ్రై ఫ్రూట్స్, నిత్యావసర సరకులను ఉచితంగా అందజేశారు.
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పోలీసులకు వడ్డీలేని రుణం: ఎస్పీ - కడప జిల్లా పోలీసులకు వివిధ రకాల రాయితీలు
కరోనా నేపథ్యంలో కడప జిల్లా పోలీసులకు ఎస్పీ అన్బురాజన్ వివిధ రకాల రాయితీలు ప్రకటించారు. కొవిడ్ బారినపడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పోలీసులకు వడ్డీలేని సులభ వాయిదాల పద్ధతిలో లక్ష రూపాయల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
ఎస్పీ అన్బురాజన్