అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన గోదాంపై కడప విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 75 లక్షలు విలువ చేసే ఐదు వేల బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో ఈ స్థాయిలో చౌక దుకాణం బియ్యం పట్టుకోవడం ఇదే మొదటిసారి. ఇటీవల కాలంలో చౌక దుకాణం బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు సమాచారం రావడంతో.. విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు. ఈ మేరకు నగరు శివారులోని గోదాముల్లో దాడులు చేశారు. కాగా యజమాని నారాయణ రెడ్డి కోసం గాలిస్తున్నారు. చౌక దుకాణ బియ్యాన్ని ఎవరు సరఫరా చేశారు.. ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. ఎవరు విక్రయించారనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
చౌక బియ్యం గోదాంలో తనిఖీలు.. 75 లక్షలు విలువచేసే బియ్యం పట్టివేత - ration rice illegal transport news update
చౌక బియ్యం గోదాంపై దాడులు చేసిన కడప జిల్లా విజిలెన్స్ అధికారులు 75 లక్షలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని పట్టున్నారు. జిల్లాలో ఈమేరకు బియ్యం పట్టుబడటం ఇదే మొదటిసారి కావడం గమన్హారం

చౌక బియ్యం గోదాంలో విజిలెన్స అధికారులు తనిఖీలు
ఇవీ చూడండి...
TAGGED:
ration rice latest news