రాష్ట్రంలో మూతపడిన ఆరు సహకార చక్కెర కర్మాగారాలను తెరవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను త్వరలోనే వెల్లడిస్తామని నిపుణుల కమిటీ తెలిపింది. కె. రవి కుమార్, కేవీ రమణ, ప్రసాద్రావుల ఆధ్వర్యంలో నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. కె.రవి కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వలనే చెన్నూరు చక్కెర కర్మాగారం మూతపడిందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 30 రోజుల్లోనే నిర్ణయం తీసున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రేపు నెల్లూరు చక్కెర కర్మాగారాన్ని పరిశీలించి అన్ని కర్మాగారాల నివేదికను ఈ నెల 9వ తేదీ లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.
మూతపడిన చక్కెర కర్మాగారాల పరిశీలన
రాష్ట్రంలో మూత పడిన చక్కెర కర్మాగారాలను మరలా ఉపయోగంలోకి తీసుకురావటానికి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. ఈ నిపుణుల కమిటీ అందజేసిన నివేదిక ఆధారంగా కర్మాగారాలను తెరిచే అవకాశాన్ని పరిశీలించనున్నారు.
Breaking News