కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేల్ పట్టణంలో తెదేపా నాయకులు కార్యకర్తలు వినూత్న రీతిలో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల రద్దుపై నిరసన తెలియజేశారు. తెదేపా నాయకుడు నరసింహ ప్రసాద్.. నవరత్నాలు వీధి వ్యాపారం చేసే వ్యక్తిగా నిరసనకు దిగారు. చిట్వేల్ పట్టణంలో ప్రజలకు అమ్ముతున్నట్టుగా ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించి పేద ప్రజల రేషన్ కార్డులు ,పెన్షన్లు తొలగించకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
తెదేపా నేతల వినూత్న నిరసన - చిట్వేల్ పట్టణంలో తెదేపా నిరసన
కడప జిల్లా చిట్వేల్ పట్టణంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పేద ప్రజలకు రేషన్ కార్డులు,పెన్షన్లు తొలగించకుండా చర్యలు చేపట్టాలని తహసీల్దార్ కి వినతి పత్రం అందచేశారు.
![తెదేపా నేతల వినూత్న నిరసన Innovative protest of Tedepa leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6040454-27-6040454-1581444532842.jpg)
తెదేపా నేతల వినూత్న నిరసన