రంజాన్ మాసంలో నిరుపేదలకు సాయం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని... ఇందాదు సొసైటీ వ్యవస్థాపకులు మహబూబ్ బాషా అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కడప నగరంతోపాటు చుట్టుపక్కల ఉన్న నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ఒక్కో కుటుంబానికి 7 కిలోల మసూర బియ్యం, కందిపప్పు, వంట నూనె, చింతపండు, శనగపప్పు, సేమియాలు, చక్కెర, ధనియాలు, మిరపకాయలు, కారం పొడి, ఒక దుప్పటి, ఒక చీరను పంపిణీ చేశారు.
నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా - Ramadan tofa to poor Muslim families given by Indadu Society in kadapa
పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు దానధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం సిద్ధిస్తుందని.. ఇందాదు సొసైటీ వ్యవస్థాపకులు మహబూబ్ బాషా అన్నారు. ఈ మేరకు కడప నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు.
రంజాన్ తోఫా