కర్నూలు, కడప జిల్లాల్లో కురిసిన వర్షాలతో నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. గత వారం రోజులుగా సగటున 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా సోమవారం ఉదయం 25 వేలు ...మధ్యాహ్నానికి 30 వేల క్యూసెక్కులుకు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. చాపాడు మండలం సీతారామపురం వద్ద దాదాపు 40వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. శ్రీశైలం జలాశయం పోతిరెడ్డిపాడు నుంచి వస్తున్న నీటికి వర్షపు నీరు కలవడంతో వరద ప్రవాహం పోటెత్తింది. నదిలో ప్రవాహం గంటగంటకూ పెరుగుతూ ఉండడంతో పరివాహక ప్రాంతంలో పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని నెమల్ల దిన్నె చాపాడు మండలం సీతారాంపురం వద్ద ఉన్న వంతెన పైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కుందునదిలో పెరుగుతున్న వరద ప్రవాహాం.. - Increasing Flood Flow in kundu river because of heavy rains at kadapa district.
రోజురోజుకి కురుస్తున్న భారీ వర్షాలకు కుందునదిలో వరద ప్రవాహాం అధికమవుతోంది. ఈ వరద ఉధృతికి పరివాహక ప్రాంతంలో పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది.
Flood Flow in kundu river because of heavy rains at kadapa district.