ATM Fraud in Kadapa: ఏటీఎం కార్డును తారుమారు చేసి 48 వేల రూపాయలు నగదును దొంగలించాడు ఓ వ్యక్తి. కడపకు చెందిన సుబ్బన్న ఆర్ అండ్ బీ శాఖలో ఉద్యోగిగా పదవీ విరమణ పొందాడు. అతనికి పింఛన్ డబ్బులు పడడంతో డ్రా చేసుకునేందుకు కడపలోని విశ్వేశ్వరయ్య కూడలి వద్ద ఉన్న ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అప్పటికే ఏటీఎంలో ఓ వ్యక్తి నగదు తీస్తున్నట్లు నటిస్తున్నాడు. ఆ వ్యక్తి తన కార్డు పెడితే నగదు రావడంలేదని మీ కార్డు ఇస్తే పరిశీలించి ఇస్తానని సుబ్బన్నను అడగడంతో.. అతని మాటలు నమ్మి కార్డు ఇచ్చాడు. కార్డు తిరిగి ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి నకిలీ కార్డును సుబ్బన్నకిచ్చి.. అసలైన కార్డును తాను తీసుకున్నాడు. సుబ్బన్న ఆ కార్డు తీసుకొని వెళ్లిపోగా.. కొద్దిసేపటికి ఖాతాలో నుంచి నాలుగు విడతలుగా 40 వేల రూపాయలు, మరోసారి ఎనిమిది వేల రూపాయలు నగదు డ్రా చేశాడు. బాధితుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మీ ఏటీఎం కార్డు వేరే వారికి ఇస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త - kadapa news
ATM Fraud in Kadapa: ఏటీఎంలో డబ్బులు తీస్తున్నట్లు ఓ వ్యక్తి నటించాడు. ఏటీఎం పనిచేయడం లేదు ఏమో.. ఒక సారి మీ కార్టుతో పరిశీలిస్తా అని వేరే వ్యక్తిని నమ్మించాడు. ఈ సమయంలో కార్డును మార్చేశాడు. తరువాత అతని ఖాతాలో డబ్బులు కొట్టేశాడు. ఈ ఘటన కడపలో చోటుచేసుకుంది.
ఏటీఎం మోసం