కడప జిల్లా జమ్మలమడుగులో షిరిడి సాయి బ్యానర్స్లో తీసిన అవలంబిక సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. క్యాంప్ బెల్ ఆస్పత్రి ఆవరణలో సూపరిండెంట్ డాక్టర్ అగస్టీన్ రాజు పోస్టర్ను విడుదల చేశారు. అవలంబిక సినిమా షూటింగ్ క్యాంప్ బెల్ హాస్పత్రి, జమ్మలమడుగు, గండికోట, మైలవరం తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసినట్లు తెలిపారు. నిర్మాత శ్రీనివాస్ గౌడ్, దర్శకుడు రాజశేఖర్, హీరో హీరోయిన్ సుజయ్, అర్చన సినిమా కోసం చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, ప్రతి ఒక్కరూ చూసి సినిమాను విజయవంతం చేయాలని కోరారు.
జమ్మలమడుగులో అవలంబిక సినిమా పోస్టర్ ఆవిష్కరణ - Inauguration of the avalambika Movie Poster at kadapa district news
క్యాంప్ బెల్ ఆస్పత్రి ఆవరణలో సూపరిండెంట్ డాక్టర్ అగస్టీన్ రాజు అవలంబిక సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. కడప జిల్లా జమ్మలమడుగులో షిరిడి సాయి బ్యానర్స్లో తీసిన అవలంబిక సినిమాలో హీరో హీరోయిన్లుగా సుజయ్, అర్చన నటించారు.
అవలంబిక సినిమా పోస్టర్ ఆవిష్కరణ