కడప జిల్లా రాజంపేట మండలం చోప్పావారిపల్లె వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో, కారు ఢీకొన్న ఘటనలో చిన్నారి మృతి చెందింది. 11 మందికి గాయాలయ్యాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరికి చెందిన 14 మంది తిరుమలేశుని దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీకాళహస్తిలోని ఆలయాన్ని సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. రాజంపేట మండలం చొప్పావారి పల్లె వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్నబొలేరో వాహనాన్ని... ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చందన అనే పదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స కోసం వారిని తిరుపతికి తరలించారు.
పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం... బాలిక మృతి - in kadapa road accident one girl died and 11 people were injured
పుణ్య క్షేత్రాలను దర్శించుకుని వస్తున్న వారిని విషాదం వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం... కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బాలిక మృతిచెందగా 11 మందికి గాయాలయ్యాయి.
![పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం... బాలిక మృతి in kadapa road accident one girl died and 11 people were injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5504959-392-5504959-1577390064276.jpg)
కడపలో రోడ్డు ప్రమాదం..బాలిక మృతి, 11 మందికి తీవ్రగాయాలు
కడపలో రోడ్డు ప్రమాదం..బాలిక మృతి, 11 మందికి తీవ్రగాయాలు