కడప జిల్లా బద్వేలులో నీటి ఎద్దడి తీవ్ర స్థాయిలో ఉంది. నీరు లేక అలమటిస్తున్న ప్రజలు... పురపాలక కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు సీపీఐజిల్లా అధ్యక్ష్యుడు ఈశ్వరయ్య మద్దతు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించడంలో అధికారులు పాలకవర్గం విఫమైందని విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణారెడ్డి ఇచ్చినహామీతో మహిళలు శాంతించి ధర్నా విరమించారు.
తాగునీటి కోసం రోడెక్కిన మహిళలు - తాగునీటి సమస్య
కడప జిల్లా బద్వేలు పురపాలక కార్యాలయం ఎదుట తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సీపీఐ సంఘీభావం తెలిపింది.
సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న మహిళలు