కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మాస్కులు తయారు చేస్తూ పలు ప్రభుత్వ శాఖలకు అందజేస్తున్నారు. కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మాస్కులు సరఫరా చేస్తున్నారు. 60 మంది ఖైదీలు రోజుకు 7 వేల మాస్కులు తయారు చేస్తున్నారు. జైలు సిబ్బందితో పాటు, ప్రభుత్వ శాఖల అధికారులకు వీటిని తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో లక్ష మాస్కులు కడప కేంద్ర కారాగారం నుంచి తయారు చేశామని జైలు సూపరింటెండెంట్ నాయక్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో లక్ష మాస్కులు తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామంటున్న కడప జైలు సూపరింటెండెంట్ నాయక్తో మా ప్రతినిధి మురళీ ముఖాముఖి.
నెల రోజుల్లో లక్ష మాస్కులు తయారు చేసిన కడప ఖైదీలు
కరోనాపై పోరులో రాష్ట్రంలోని ఖైదీలు సైతం భాగస్వాములు అవుతున్నారు. కేవలం నెలరోజుల్లో కడప కేంద్ర కారాగారంలోని 60 మంది ఖైదీలు లక్ష మాస్కులు తయారు చేశారు. మరో లక్ష మాస్కులు తయారీ లక్ష్యంగా పని చేస్తున్నారు.
kadapa jail