కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇసుక అక్రమ నిల్వలపై అధికారులు దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరులోని తిమ్మయ్య కళ్యాణమండపం వద్ద రెండు ఇసుక డంప్‌లను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమంగా నిల్వ ఉంచారనే ముందస్తు సమాచారంతోనే దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు వెయ్యి టన్నుల ఇసుకను, ఒక జేసీబీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రొద్దుటూరులో వెయ్యి టన్నుల ఇసుక స్వాధీనం - illegally stored sand seized in proddhutur
అక్రమంగా నిల్వ చేసిన రెండు ఇసుక డంప్‌లపై అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు వెయ్యి టన్నులు ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది.

అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక స్వాధీనం