కడప జిల్లా రాజంపేట- రాయచోటి మార్గంలోని ఎస్ఆర్ పాలెం వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 1100 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. కర్ణాటక నుంచి మద్యం తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కారుతో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు రాజం పేట ఎక్సైజ్ సీఐ శివ సాగర్ తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ. 2లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
1100 మద్యం బాటిళ్ల పట్టివేత.. నలుగురు అరెస్ట్ - moving liquor in Kadapa
రాజంపేట- రాయచోటి మార్గంలో ఎక్సైజ్ శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 1100 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. కారుతో పాటు ద్విచక్రవాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నలుగురు అరెస్ట్