కడప జిల్లా బద్వేల్ అటవీశాఖ రేంజ్ పరిధిలోని చౌదరివారిపల్లి గ్రామ శివారులో అటవీశాఖ అధికారులు ఎర్రచందనం దుంగల డంప్‌ను గుర్తించారు. వాగుల్లో దాచిపెట్టిన ఎర్రచందనం దుంగలను వెలికితీశారు. మొత్తం 142 దుంగలను పోలీసులు పట్టుకున్నారు. మార్కెట్లో వీటి విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
వాగుల్లో దాచిన ఎర్రచందనం దుంగలు స్వాధీనం - కడప జిల్లా తాజా వార్తలు
గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా దాచిన ఎర్రచందనం దుంగలను కడప జిల్లా బద్వేల్ అటవీశాఖ రేంజ్ అధికారులు గుర్తించారు. వాగుల్లో ఉంచిన ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం