కడప జిల్లా రైల్వేకోడూరు టాస్క్‌ఫోర్స్ సబ్ కంట్రోల్ పరిధిలోని ఒంటిమిట్ట మండలం చింతలగుంట ఫారెస్ట్ ఏరియాలో 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని , నలుగురు స్మగ్లర్లను రైల్వేకోడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వేకోడూరు టాస్క్‌ఫోర్స్ ఆర్ఐ కృపానంద ఇచ్చిన సమాచారం మేరకు ఒంటిమిట్ట మండలం చింతలగుంట ఫారెస్ట్ ఏరియాలో కూంబింగ్ చేస్తుండగా ఈరోజు ఉదయం అయిదున్నర గంటల ప్రాంతంలో కోతాపీ కోన వద్ద అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నామని అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి 489 కేజీల బరువు గల 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు స్మగ్లర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చింతలగుంట ఫారెస్ట్‌లో అక్రమంగా ఎర్రచందనం తరలింపు.. నలుగురి అరెస్ట్ - అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న నలుగురి అరెస్ట్
ఒంటిమిట్ట మండలం చింతలగుంట ఫారెస్ట్ ఏరియాలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న నలుగురిని రైల్వేకోడూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్మగ్లర్ల నుంచి 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న నలుగురి అరెస్ట్