కడప జిల్లాలో గుట్కా నిల్వలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అట్లూరులో అక్రమంగా నిల్వ ఉంచిన పది వేల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కొండూరు గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి బద్వేల్ లో ఉండే నారాయణ వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నారని సమాచారం అందడంతో... వెంటనే పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిషేధిత గుట్కా స్వాధీనం - ఈటీవీ భారత్ తాజా వార్తలు
కడప జిల్లాలోని అట్లూరులో నిషేధిత గుట్కా విక్రయిస్తున్న దుకాణంపై పోలీసులు దాడులు చేశారు. సుమారు పది వేల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
నిషేధిత గుట్కా స్వాధీనం