కడపకు చెందిన యువకులు స్థానిక భగత్‌సింగ్ నగర్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. తరువాత మూసి వేస్తారు. ఆ తరువాత వీరు ఒక్కో సీసాపై 100 రూపాయలు ఎక్కువకు విక్రయిస్తున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
భగత్‌సింగ్‌నగర్‌లో అక్రమంగా మద్యం విక్రయాలు... ముగ్గురి అరెస్ట్ - illegal liquor sales in kadapa bhagat singh nagar
రాష్ట్రంలో మద్యం ధరలు పెరగటంతో కొంతమంది యువత లాభాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మద్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసి వాటిని అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇలాంటి ఘటనే కడప శివారులో జరిగింది. భగత్‌సింగ్‌నగర్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
భగత్ సింగ్ నగర్లో అక్రమంగా మద్యం విక్రయాలు... ముగ్గురు అరెస్ట్
ఇవీ చదవండి
రాజంపేటలోభవన నిర్మాణ కార్మికుల ఆందోళన