కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రైల్వే గేట్ సమీపంలో గ్రామీణ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా జమ్మలమడుగు వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనానంలోని ముగ్గురు వ్యక్తుల వద్ద మద్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. మొత్తం 72 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై సునీల్‌కుమార్‌రెడ్డి వివరించారు.
ప్రొద్దుటూరులో 72 సీసాల మద్యం పట్టివేత - ఎస్సై సునీల్‌కుమార్‌రెడ్డి
కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. మొత్తం 72 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రొద్దుటూరులో అక్రమ మద్యం.. పట్టుకున్న పోలీసులు