ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ గుట్ట కబ్జా.. చదును చేసి సాగుభూమిగా మార్పు..! - land acquisition problems in kadapa

కడప జిల్లా కమలాపురం మండలంలో ప్రభుత్వ భూముల కబ్జా కలకలం రేపుతోంది. వీఆర్వో అండతో కొందరు వ్యక్తులు గుట్టలను చదును చేసి సాగుభూమిగా మార్చుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తిగా విచారణ చేస్తున్నామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో స్పష్టం చేశారు.

ప్రభుత్వ గుట్ట కబ్జా.. చదును చేసి సాగుభూమిగా మార్పు..!
ప్రభుత్వ గుట్ట కబ్జా.. చదును చేసి సాగుభూమిగా మార్పు..!

By

Published : Aug 20, 2020, 7:41 PM IST

గుట్ట కబ్జాపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్న తహసీల్దార్​

కడప జిల్లా కమలాపురం మండలంలోని దాదిరెడ్డి పల్లి గ్రామపంచాయతీకి సంబంధించి దాదాపు 50 నుంచి 100 ఎకరాల గుట్ట కబ్జాకు గురైంది. స్థానిక వీఆర్వో ఆంజనేయులు సహకారంతో కొందరు వ్యక్తులు ఈ కబ్జా తంతు నడిపారని ఆరోపణలు వస్తున్నాయి. గుట్టంతా చదును చేసి ఆ భూమిని.. సాగుభూమిగా మార్చారని.. వన్​బీ, అడంగల్​ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై వివరణ కోసం వీఆర్వోను సంప్రదించగా ఆయన ముఖం చాటేశారు.

గుట్ట కబ్జా విషయమై.. ఎమ్మార్వోను విజయ్​కుమార్​ను సంప్రదించగా.. ఈనాడు కథనం ద్వారా కబ్జా విషయం తమకు తెలిసిందని.. వెంటనే భూమిని పరిశీలించి ప్రభుత్వ భూమిగా బోర్డు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. అక్రమంగా వన్​బీ అడంగల్​ చేయించుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కబ్జా విషయంలో రెవెన్యూ అధికారుల హస్తం ఉంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అటవీ భూమి సైతం

వల్లూరు మండలం చెరువుకిందపల్లి వద్ద ఉన్న అటవీ భూమిని కూడా కొందరు కబ్జా చేసి.. మామిడి చెట్లు నాటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే నేటిపల్లె గుట్టపై కూడా చదును చేసి సాగుభూమిగా మార్చారని వాపోయారు. నంది మండలం నుంచి.. కమలాపురం పాపాగ్ని బ్రిడ్జి వద్ద ఉన్న చెరువుకింద పల్లె వరకు భూమి కబ్జాకు గురైందని చెప్పారు.

ఇదీ చూడండి..

'తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలుపుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details