అనుమతులు లేకపోయినా కడపజిల్లా ప్రొద్దుటూరులో కెవీఆర్ ఆస్పత్రి వైద్యుడు ప్రదీప్ రెడ్డి కరోనా బాధితులకు చికిత్స ఎలా చేశారని మానవ హక్కుల కన్వీనర్ జయశ్రీ నిలదీశారు. బాధితులకు ఆయనకు ఇష్టం వచ్చిన యాంటీబయోటిక్స్ ఇస్తున్నారన్నారు.
ప్రదీప్ రెడ్డిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జయ శ్రీ ప్రశ్నించారు. ఆస్పత్రిపై ఫిర్యాదు చేసిన వారి మీద దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.