కడప జిల్లా ముద్దనూరు మండలం చిన్న దుద్యాల గ్రామం వద్ద భారీ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కంకర మిషన్‌కు సుమారు 10 హెక్టార్ల కొండను లీజుకు ఇచ్చే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ పోలీస్ బందోబస్త్ నడమ నిర్వహించారు.
10 హెక్టార్ల కొండ లీజుకు..
ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ జావిద్ భాష అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి హాజరయ్యారు. 10 హెక్టార్ల కొండను లీజుకు ఇస్తే చిన్న దుద్యాల, పెద్ద దుద్యాల గ్రామస్తులు అన్ని విధాల నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి..
గతంలో కొండల్లో జరిపిన పేలుళ్ల వల్ల పెద్ద ఎత్తున నివాసాలు దెబ్బ తిన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూలంగానే పరిసర ప్రాంతాలు దుమ్ము ధూళితో నిండిపోతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో అన్ని విధాలా నష్టపోతామని.. లీజుకి ఇవ్వొద్దని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు.