కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఈ నెల నాలుగో తేదీన ఘర్షణకు పాల్పడ్డ 12 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పలువురు విద్యార్థులకు కరోనా సోకడం వల్ల పీ-2, ఈ-3 విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి ప్రకటించారు. సెలవులు ఇచ్చిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు ఉంటాయని, పీ-1, ఈ-4 విద్యార్థులకు క్యాంపస్‌లోనే తరగతులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఘర్షణ: 12మంది విద్యార్థులు సస్పెన్షన్ - idupulapaya iiit latest news
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఘర్షణకు పాల్పడ్డ విద్యార్థులను సస్పెండ్ చేశారు. మరోవైపు పలువురు విద్యార్థులకు కరోనా సోకడం వల్ల పలు విభాగాలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ