ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల ఆందోళన - idupulapaya iiit students agitaiton news

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. అభియంత్‌ టెక్‌ ఫెస్ట్‌కు తక్కువ నిధుల కేటాయింపు, మెస్‌లలో భోజనం సరిగా లేకపోవడం, ల్యాప్‌టాప్‌ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేశారు. గత రెండు రోజుల క్రితం ముప్పై మంది విద్యార్థులకు ఫుడ్ ఫాయిజన్ అయిన... మెస్​పై అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు వాపోయారు.

సమస్యలు పరిష్కరించాలంటూ ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల ధర్నా
సమస్యలు పరిష్కరించాలంటూ ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల ధర్నా

By

Published : Mar 10, 2020, 2:16 PM IST

సమస్యలు పరిష్కరించాలంటూ ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల ధర్నా

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్​ ఐటీలో పలు సమస్యలపై విద్యార్థులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో ఏటా అభియంత్ కార్యక్రమానికి విద్యార్థులకు ఆర్జీయూకేటీ నిధులను మంజూరు చేస్తారు. ఆ నిధులతో అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలకు చెందిన విద్యార్థులు ప్రాజెక్టును ప్రదర్శిస్తారు. అందులో భాగంగానే మార్చిలో జరగనున్న అభియంత్ కార్యక్రమానికి రూ.13 లక్షలు నిధులు కేటాయించాలని విద్యార్థులు కోరారు. అధికారులు నిధులు విడుదల చేయడంలో జాప్యం వహించటంతో విద్యార్థులు తరగతి గదులు బహిష్కరించి నిరసనకు దిగారు. దాదాపు రెండు వేల మందికి పైగా విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అదేవిధంగా ఇడుపులపాయ ట్రిపుల్​ ఐటీలో పలు సమస్యలు ఉన్నా... అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు. మెస్​లో నాణ్యమైన ఆహారం లేదని విద్యార్థులు ఆరోపించారు. గత రెండు రోజుల క్రితం ముప్పై మంది విద్యార్థులకు ఫుడ్ ఫాయిజన్ అయిందని ఆరోపించారు. మెస్​పై ఇంతవరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు వాపోయారు. అనంతరం డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:ఆహారం బాగోలేదంటూ ఇంజనీరింగ్ విద్యార్థుల నిరసన

ABOUT THE AUTHOR

...view details