ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కెమెరా కళ్లకు చిక్కిన ఆగంతకుడు..వీడిన వేంపల్లి మిస్టరీ - Identification of vehicle arson suspec

Fire To Vehicles: వైఎస్‌ఆర్‌ జిల్లా వేంపల్లిలో రెండు నెలలుగా ఓ ఆగంతకుడు వాహనదారులకు, పోలీసులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాడు. ద్విచక్రవాహనాలు, కార్లకు నిప్పుపెడుతూ అలజడి సృషిస్తున్నాడు. ఈ ఉదయం కూడా ఓ కారుకు నిప్పుపెట్టిన నిందితుడు ఎట్టకేలకు సీసీ కెమెరా దృశ్యాలకు చిక్కాడు.

Identification of vehicle arson suspect in ysr distric
కెమెరా కళ్లకు చిక్కిన ఆగంతకుడు..వీడిన వేంపల్లి మిస్టరీ

By

Published : Feb 27, 2023, 12:45 PM IST

Updated : Feb 27, 2023, 2:14 PM IST

Fire To Vehicles: వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో వాహనాలకు నిప్పుపెడుతూ ఆందోళన కలిగిస్తున్న ఆగంతకుడ్ని పోలీసులు గుర్తించారు. వేంపల్లికి చెందిన సంతోశ్‌ కుమార్‌కు చెందిన కారుకు సోమవారం వేకువ జామున అగంతకుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. అది గమనించిన స్థానికులు వెంటనే నీరు చల్లి ఆర్పేశారు.


ఆరు టూవీలర్స్ , మూడు కార్లకు నిప్పు: గత రెండు నెలలుగాపులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి లో వాహన యాజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వ్యక్తి ఎట్టకేలకు సీసీ కెమెరాలకు చిక్కాడు. గత రెండు నెలలుగా ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టి పరార్ అవుతున్నాడు. గత రెండు నెలలుగా ఇప్పటి వరకు ఆరు టూవీలర్స్ , మూడు కార్లకు నిప్పు పెట్టారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న వాహనాలకు నిప్పు పెడుతున్న వ్యక్తిని గుర్తించలేక పోయారు. వాహనాలకు నిప్పు పెడుతున్న ఆగంతకుడు కూడా ఆపకుండా నిప్పు పెడుతూనే ఉన్నాడు.

కెమెరా కళ్లకు చిక్కిన ఆగంతకుడు:ఇన్నాళ్లుగా దొరకలేదు కదా ఇక కూడా దొరకనుకున్నాడో ఏమో ప్రధానమైన వీధి అమ్మవారి శాల వీధిలో సీసీ కెమెరాలు ఉన్న ఇంటి ఎదుట పార్క్ చేసిన వాహనానికి దర్జాగా నిప్పు పెట్టాడు. ఈ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. నిందితుడు తన వెంట తెచ్చుకున్న పెట్రోలు మొదట వాహనంపై చల్లి అగ్గి పుల్ల సహాయంతో నిప్పు పెట్టి అక్కడి నుంచి పరార్ అయ్యడు. దీంతో వాహనాలకు నిప్పు పెడుతున్న వ్యక్తి కోసం వేంపల్లి పోలీసులు గాలిస్తుండగా నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడు వేంపల్లి వాసిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం తెలిసింది. నిందితుడు సీసీ కెమెరాలు చిక్కడంతో అటు పోలీసులు ఇటు వేంపల్లి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నింధితుడు కోసం వేంపల్లి పోలీసులు వేట ప్రారంభించారు.

గతంలో మానసిక రోగిని అదుపులోకి తీసుకున్న పోలీసులు: ఇటీవల కాలంలో నాలుగు మోటర్ బైకులకు, కారుకు నిప్పు పెట్టడం జరిగింది. పోలీసులు నిఘా పెట్టి ఒక మానసిక రోగిపై అనుమానంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మానసిక ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల మౌనంగా ఉన్న గుర్తు తెలియని దుండగులు మళ్లీ రంగంలోకి దిగి వాహనాలకు నిప్పు పెడుతున్నారు.

పోలీసులకు ఛాలెంజ్:గతంలో వేంపల్లెలోని తిరుమల సినిమా హాల్ వద్ద తెల్లవారు జామున మహమ్మద్ రఫి పార్కింగ్ చేసిన కొత్త కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెడుతుండగా స్థానిక మహిళలు చూసి కేకలు వేశారు. దీంతో దుండుగులు పరారైనట్లు వారు తెలిపారు. వేంపల్లెలో వరుసగా వాహనాలకు నిప్పు పెడుతుండడంతో పోలీసులకు ఛాలెంజ్​గా మారింది.

వేంపల్లె వాసి సంతోష్‌కుమార్‌ కారుకు నిప్పు పెట్టిన దుండగుడు

ఇవీ చదవండి

Last Updated : Feb 27, 2023, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details