ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజా సమస్యలు తీర్చగలిగితే అదే చాలు: ఐఏఎస్ శివగోపాల్ రెడ్డి - ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఐఏఎస్ శివ గోపాల్ రెడ్డికి సన్మానం

ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్ విద్యార్థులతో ఐఏఎస్ శివ గోపాల్ రెడ్డి ముచ్చటించారు. తన విజయాల గురించి విద్యార్థులకు వివరించారు.

IAS Shiva Gopal Reddy
ఐఏఎస్ శివ గోపాల్ రెడ్డి

By

Published : Apr 4, 2021, 5:30 PM IST

కడప జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో ఉన్న ట్రిపుల్ ఐటీలో.. ఒంగోలు క్యాంపస్ పూర్వ విద్యార్థి శివ గోపాల్ రెడ్డి.. ఐఏఎస్ సాధించి తొలిసారిగా ట్రిపుల్ ఐటీకి వచ్చారు. ఇందులో భాగంగా... విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తను సాధించిన విజయాలు, అనుభవాలు గురించి వారికి తెలియజేశారు.

తాను ఐఏఎస్ సాధించటంలో తల్లిదండ్రుల కృషితో పాటు ఆర్జీయూకేటీ ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. కర్తవ్య నిర్వహణలో ప్రజా సమస్యలు తీర్చగలిగితే అదే చాలని చెప్పారు. అలాగే ట్రిపుల్ ఐటీలో చదివి మంచి ఉద్యోగాలు సాధించిన సీనియర్లు అందరం కలిసి జూనియర్లకు అవగాహన కల్పించటం అనందంగా ఉందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details