ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ పోలీసుల నిర్లక్ష్యం.. వెబ్‌సైట్‌ నిర్వహణలో వెనుకంజ - AP police department news

Hyd Police Commissioner Post is Absent in Website: తెలంగాణ రాష్ట్ర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంలో మాకు మేమే సాటి.. దేశంలోనే తమతో ఎవరూ పోటీపడలేరని అంటుంటారు కానీ సొంత వెబ్‌సైట్‌ నిర్వహణలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగి 15 రోజులు గడుస్తున్నా పలువురి పోస్టులు వెబ్​సైట్​లో అప్​డేట్ చేసి కొన్ని కీలక స్థానాలను వదిలేయడం చర్చనీయాంశంగా మారింది.

TG Police website
తెలంగాణ పోలీసులు

By

Published : Jan 19, 2023, 3:12 PM IST

Hyd Police Commissioner Post is Absent in Website: సాంకేతిక పరిజ్ఞానంలో మాకు మేమే సాటి అంటారు.. దేశంలోనే తమతో ఎవరూ పోటీపడలేరని తెలంగాణ పోలీసులు అంటుంటారు కానీ సొంత వెబ్‌సైట్‌ నిర్వహణలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. ఐపీఎస్‌ ఉన్నతాధికారుల బదిలీలు జరిగి 15 రోజులు గడిచినా తాజా పోస్టుల్ని పూర్తిస్థాయిలో నమోదు చేయలేదు. కొత్త పోస్టుల్లోకి మారిన అధికారుల జాబితాను ఇంకా అప్‌డేట్‌ చేయలేదనుకుంటే మరిచిపోయారులే అనుకోవచ్చు. కానీ పలువురి పోస్టులను అప్‌డేట్‌ చేసి.. కొన్ని కీలక స్థానాలను వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వెబ్‌సైట్‌లో ఉండేది కేవలం ఐపీఎస్‌ అధికారుల వివరాలు మాత్రమే. ప్రస్తుతం 124 మంది పలు స్థానాల్లో ఉన్నారు. కేవలం ఇన్ని పోస్టులనే అప్‌డేట్‌ చేయలేకపోవడం పోలీస్‌శాఖ నిర్లిప్తతను తేటతెల్లం చేస్తోందనే విమర్శ వినిపిస్తోంది.

Telangana Police Website : వెబ్‌సైట్‌లో ఎస్పీఎఫ్‌ డీజీ పోస్టునే ఎత్తేశారు. రాష్ట్ర పోలీస్‌శాఖలో సీనియర్‌ మోస్ట్‌ ఐపీఎస్‌ ఉమేశ్‌ షరాఫ్‌ ప్రస్తుతం ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీ పోస్టుతోపాటు ఎస్పీఎఫ్‌ అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. కానీ ఆ సంగతే మరిచారు.

*రాష్ట్రంలో డీజీపీ పోస్టు తర్వాత కీలక స్థానం హైదరాబాద్‌ నగర కమిషనర్‌. వెబ్‌సైట్‌లో ఎక్కడా ఈ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. నగర కొత్వాల్‌గా ప్రస్తుతం సీవీ ఆనంద్‌ ఉన్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరోకు ఏడీజీపీగా ఆయనకే బాధ్యతలు అప్పగించారు. ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావిస్తూ హైదరాబాద్‌ కమిషనర్‌ పోస్టునే ఎత్తేశారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను మాత్రం సైబరాబాద్‌ కమిషనర్‌గానూ పేర్కొన్నారు.

*ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా.. ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌(పీఅండ్‌ఎల్‌) అధిపతిగా.. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఇద్దరేసి ఉన్నతాధికారుల పేర్లను ప్రస్తావించారు. ఇప్పటివరకు సంజయ్‌కుమార్‌ జైన్‌ ఒక్కరే ఈ మూడు పోస్టుల బాధ్యతల్ని నిర్వర్తించారు. తాజా బదిలీల్లో శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఆయనకు కీలకపాత్ర అప్పగించారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా రాజీవ్‌రతన్‌.. ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా నాగిరెడ్డి.. పీఅండ్‌ఎల్‌ డీఐజీగా మస్తిపురం రమేశ్‌రెడ్డి.. ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. వీరి పేర్లను ఆయా పోస్టుల్లో ప్రస్తావించారు. కానీ సంజయ్‌ను శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా పేర్కొంటూనే పాత పోస్టులకూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు చూపడం గమనార్హం.

*విశ్వప్రసాద్‌ హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఉన్నారు. అంతకు ముందు సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా పనిచేసి రిలీవ్‌ అయినా అలాగే కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా ఉన్న రాజేశ్‌చంద్రను మాత్రం ఆదిలాబాద్‌ అదనపు ఎస్పీ(ఆపరేషన్స్‌)గా పేర్కొన్నారు. కీలకమైన రామగుండం కమిషనర్‌ ఎవరనే ప్రస్తావనే లేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details