ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య కాపురానికి రావటం లేదని భర్త ఆత్మహత్యాయత్నం ! - కడపలో భర్త ఆత్మహత్యాయత్నం !

భార్య కాపురానికి రావటంలేదని కడప జిల్లా మైదుకూరులో అశోక్ అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు యువకుడిని మాటల్లో పెట్టి అదుపులోకి తీసుకున్నారు.

భర్త ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 26, 2019, 6:53 AM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన అశోక్​కు మైదుకూరు పట్టణానికి చెందిన మహిళ తో పదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్ల వరకు కాపురం సజావుగా సాగిపోగా.. మధ్యలో తలెత్తిన విభేదాలతో అత్తవారి ఇంటి వద్దనే కాపురం చేసేలా ఒప్పందం చేసుకున్నారు. 8 నెలల కిందట అత్తారింటి నుంచి వెళ్లిపోయిన అశోక్ ఇటీవల తన భార్యను కాపురానికి పంపాలంటూ మామతో ఘర్షణ పడటంతో మైదుకూరు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. తాజాగా మరోసారి అత్తగారి ఇంటికి వచ్చిన అశోక్.. తన భార్యను కాపురానికి పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ పోసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు.

భర్త ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details