కడప ఓం శాంతి నగర్ కు చెందిన లక్ష్మయ్య, అన్నపూర్ణమ్మ హోమియోపతి వైద్యులు. వీరికి పదహారేళ్ల కుమార్తె ఉంది. బాలిక విదేశాల్లో ఉంటూ చదువుకుంటోంది. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో అక్కడే మృతి చెందింది. ఈ మేరకు తమ బిడ్డ మృతదేహాన్ని కడపకు రప్పించేందుకు ఐదు లక్షలు వెచ్చించారు. అప్పు చేసి ఆ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ విషయం పై భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ డబ్బుల విషయంలో గొడవలు జరుగుతుండేవి.
ఇదే క్రమంలో.. ఈ నెల 22వ తేదీ భార్యాభర్తల మధ్య వివాదం చేలరేగింది. కోపోద్రిక్తుడైన భర్త... భార్య తలపై సుత్తితో బలంగా కొట్టగా.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన భర్త.. ఆమె ప్రమాదవశాత్తూ కింద పడిందని.. తీవ్ర గాయమై చనిపోయిందని నమ్మించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సునీల్ పేర్కొన్నారు.