కడప రవీంద్రనగర్‌లో.. ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా నరికి హత్యచేశాడు. అడ్డుకోబోయిన మరో మహిళపైనా దాడి చేశాడు. రవీంద్రనగర్‌కు చెందిన దస్తగిరి, బీబీజాన్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇటీవలే వారి కుమారుడు మృతిచెందాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న దస్తగిరి... భార్యను వేధించేవాడు. ఈ ఉదయం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కత్తితో భార్యపై దాడిచేసిన దస్తగిరి. . దారుణంగా నరికి హత్యచేశాడు. అడ్డుకోబోయిన మరదలిపైనా దాడిచేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
కడపలో దారుణం.. భార్యను కత్తితో నరికిన భర్త - Husband kills wife in Kadapa news
భార్యపై అనుమానంతో ఓ భర్త కత్తితో ఆమెని నరికి చంపాడు. ఆ దారుణాన్ని అడ్డుకోబోయిన మరో మహిళపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన కడపలోని రవీంద్రనగర్‌లో జరిగింది.
మృతదేహం వద్ద ఏడుస్తున్న పిల్లలు
డబ్బులు ఇవ్వనందుకే తన అక్కని చంపేశాడని మృతురాలి సోదరి ఆరోపించారు. పిల్లలు ఎలా బతకాలి అని కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చూడండి.నారాకోడూరులో విషాదం...రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి