భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. కడపకు చెందిన శివకుమార్‌రెడ్డికి ప్రొద్దుటూరు వాసి శారదతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తలిద్దరికీ మనస్పర్థలు రావడం వల్ల విడిగా ఉంటున్నారు. కుమారుడిని చూడటానికి శివకుమార్ భార్య పుట్టింటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో కుమారుడిని చూడటానికి వెళ్లిన సమయంలో భార్యను తనతో పాటు రావాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రొద్దుటూరులో భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య - man sucide in proddutoor
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదన్న కారణంతో మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రొద్దుటూరులో భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
ప్రొద్దుటూరులో భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య