ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానంతో భార్యపై కత్తితో దాడి - నరసరాంపేట నేర వార్తలు

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో దాడిచేశాడు. ఈ ఘటన కడపజిల్లా నరసరాంపేటలో జరిగింది. బాధితురాలు పరిస్థితి విషమంగా ఉంది.

husband  attacked with knife on  wife at narasarmpeta
బాధితురాలు పెంచలమ్మ

By

Published : Apr 14, 2021, 12:39 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరు నరసరాంపేటలో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. నరసరాంపేటకు చెందిన సురేష్, పెంచలమ్మ భార్యభర్తలు. కొంత కాలంగా రైల్వేకోడూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో ఆమె నర్స్​గా పనిచేస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తకు కొంత కాలంగా పెరాలసిస్ రావడంతో .. అతనికి వైద్యం కూడా చేయిస్తోంది. పిల్లలను కూడా ఆమె సంపాదనతోనే పోషిస్తోంది. ఆమెమీద అనుమానంతో సురేష్.. గొడవకు దిగాడు. వారి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరడంతో.. కోపోద్రిక్తుడైన భర్త ఆమెపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది .దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details