ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోన్​ ఎత్తలేదన్న కోపంతో భార్యపై మందుబాబు దాడి - ananthayyagaripalli latest crime news

లాక్​డౌన్​లో ఇన్నాళ్లు సాఫీగా సాగిన ఓ భార్యభర్తల జీవితంలోకి మద్యం వచ్చి చిచ్చు పెట్టింది. ఫోన్​ ఎత్తలేదనే కారణంతో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన కడప జిల్లా అనంతయ్యాగారిపల్లెలో జరిగింది.

ఫోన్​ ఎత్తలేదన్న కారణంగా భార్యపై మందుబాబు దాడి
ఫోన్​ ఎత్తలేదన్న కారణంగా భార్యపై మందుబాబు దాడి

By

Published : May 5, 2020, 6:40 PM IST

కడప జిల్లా అనంతయ్యగారిపల్లె సమీపంలోని మామిడి తోటలో కాపలా ఉంటున్న గిరిజన దంపతుల మధ్య.. మద్యం చిచ్చు పెట్టింది. నిన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవగా.. మళ్లీ తాగడం మొదలుపెట్టిన భర్త సురేష్... తను ఫోన్ చేస్తే ఎత్తలేదనే కారణంతో భార్యపై గొడ్డలితో దాడి చేశాడు.

తలపైన బలమైన గాయం కావటంతో కుటుంబసభ్యులు బాధితురాలిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స చేయించారు. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీస్​ స్టేషన్​లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details