కడపకు చెందిన ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యంది హత్యేనని.. పౌరహక్కుల సంఘం నిజనిర్ధరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. పోలీసులు లోతుగా పరిశీలిస్తే మృతికి కారణాలు వెల్లడవుతాయని అభిప్రాయపడ్డారు. సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపారు.
సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, ఆయన వద్ద పనిచేస్తున్న జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులను విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. ఆయన మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.