స్థానిక ఆమదాలవలస రైల్వే క్వార్టర్స్ లో భారీ చోరీ జరిగింది. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న స్వతంత్ర రావు మూడు రోజుల క్రితం తన స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని నగదు, బంగారం, వెండి ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయని గ్రహించిన స్వతంత్రరావు... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ.. నగదు, వెండి, బంగారం అపహరణ - amadalavalasa crime
ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆమదాలవలసలో చోరీ