కడప జిల్లా పెద్దముడియం మండలం కొట్టాలపల్లి గ్రామంలో భారీ పుట్టగొడుగును గుర్తించారు. సాధారణంగా వానాకాలంలో చెట్లకింద, పొలాల్లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగులు ఏర్పడుతుంటాయి. రైతులు, ప్రజలు ఉదయాన్నే పొలాలకు వెళ్లి అలా వెలిసిన పుట్టగొడుగులను తీసుకువచ్చి వండుకుంటారు. పెద్దముడియం మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే రైతు పొలంలో సుమారు పది కిలోల బరువున్న భారీ పుట్ట గొడుగును గుర్తించారు. వ్యవసాయ పనులు చేస్తుండగా దీన్ని గుర్తించినట్లు రైతు తెలిపాడు. భారీ పుట్టగొడుగును చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అబ్బో ఎంత పెద్ద పుట్టగొడుగో..మీరూ చూడండి
కడప జిల్లా పెద్దముడియం మండలం కొట్టాలపల్లి గ్రామంలోని ఓ రైతు పొలంలో భారీ పుట్టగొడుగును గుర్తించారు. వ్యవసాయ పనులు చేస్తుండగా గుర్తించినట్లు రైతు వెంకట్ రెడ్డి తెలిపాడు. ఇది సుమారు 10కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు.
కొట్టాలపల్లిలో పదికిలోల పుట్టగొడుగు