ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్.. నష్టాల బాటలో ఆర్టీసీ - జమ్మలమడుగులో లాక్​డౌన్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోంది. మార్చి 21న జనతా కర్ఫ్యూ తర్వాత.. 22వ తేదీ నుంచి నిరంతరాయంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. జమ్మలమడుగు ఆర్టీసీ డిపోకు ఇంతవరకు రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది.

Huge damage to RTC due to lockdown  in jammalamadugu
జమ్మలమడుగు ఆర్టీసీకి భారీ న

By

Published : Apr 3, 2020, 12:00 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మార్చి 21న జనతా కర్ఫ్యూ, 22వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో.. ఈ ప్రభావం ఆర్టీసీపై విపరీతంగా పడుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ డిపోకు ఇంతవరకు రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. బస్సులన్నీ డిపోలకే పరిమితం అవుతుండగా.. మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగు ఆర్టీసీ డిపోలో 200 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. 44 ఆర్టీసీ బస్సులు, 35 అద్దె బస్సులు ప్రజలకు అందుబాటులో ఉన్నా..లాక్ డౌన్ కారణంగా రాకపోకలు బంద్ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details