ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజంపేటలో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన - రాజంపేటలో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులను... ప్రభుత్వం ఆదుకోవాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజంపేటలోని ఏఐటీయూసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

house construction workers dharna at rajampeta in kadapa
రాజంపేటలో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

By

Published : May 11, 2020, 2:48 PM IST

Updated : May 11, 2020, 5:04 PM IST

కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... ఆ సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. కడప జిల్లా రాజంపేటలోని ఏఐటీయూసీ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరోనా కారణంగా పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కార్మిక శాఖ ద్వారా ఒక్కొక్కరికి రూ.10వేలు ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు. పెంచిన సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:కరోనా పరీక్షలు చేయాలంటూ మున్సిపల్​ కార్మికుల ధర్నా

Last Updated : May 11, 2020, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details