తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకున్న ఘటనపై హోంమంత్రి సుచరిత స్పందించారు. ఘటన పూర్తిగా ప్రజా వ్యతిరేకత వల్ల జరిగిందే తప్ప వైకాపా పాత్ర ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారు. పోలీసుల పనితీరు బాగా లేదనడం సరికాదన్నారు. ఇవాళ కడప పర్యటనకు వెళ్లిన హోంమంత్రి సుచరిత..... కడప పెద్ద దర్గాను సందర్శించారు. అలాగే కేంద్ర కారాగారాన్ని పరిశీలించారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర కారాగారంలో ఫర్నీచర్ తయారీ, వృత్తి నైపుణ్య కేంద్రాలకు శంకుస్థాపన చేశారు.
'చంద్రబాబును అడ్డుకోవడంలో వైకాపా పాత్ర లేదు' - హోంమంత్రి సుచరిత వార్తలు
ఉత్తరాంధ్ర ప్రజలే చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. చంద్రబాబును అడ్డుకున్న ఘటనలో వైకాపా పాత్ర లేదని ఆమె తెలిపారు. పోలీసుల పనితీరు బాగా లేదనడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఈ పోలీసులే పనిచేశారని గుర్తుంచుకోవాలన్నారు.
home minister comments on chandrababu