అయోధ్యలో రామాలయ భూమిపూజ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి మద్దతు తెలుపుతూ బీజేవైఎం నాయకులు కడప జిల్లా జమ్మలమడుగులో సంబరాలు జరుపుకొన్నారు. పట్టణంలోని పురాతన సోమేశ్వర స్వామి దేవస్థానం ఆలయం ఆవరణలో టెంకాయలు కొట్టారు. దశాబ్దాల కలం నాటి కోరిక నెరవేరినందుకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలని వేడుకుంటూ ఆలయం ఆవరణలో 108 టెంకాయలు కొట్టారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలని ఆలయంలో పూజలు - అయోధ్య రామ మందిర్
అయోధ్య రామాలయ భూమిపూజ నిర్వహించినందుకు మద్దతుగా.. బీజేవైఎం నాయకులు ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. అలాగే 108 టెంకాయలు కొట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలని వేడుకున్నారు.
home-minister