'గురి' తప్పని బుల్లెట్ - రైఫిల్ షూటింగ్‌లో పతకాల పంట పండిస్తోన్న యువ కెరటం High Talented Rifle Shooter: మొదట్లో సరదాగా రైఫిల్ పట్టుకుని తిరిగిన ఈ అమ్మాయికి.. లక్ష్యాలను గురిచూసి కొట్టడం వెన్నతో పెట్టిన విద్య. షూటింగ్ అభ్యసించడం మొదలుపెట్టిన ఏడాదికే.. జిల్లా, రాష్ట్రస్థాయిలో పతకాల పంట పండిస్తోంది. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన పోటీల్లో రజతం గెలిచి జాతీయ పోటీలకూ అర్హత సాధించింది. టీనేజ్‌లోనే సీనియర్ విభాగంలో పోటీపడే అవకాశం దక్కించుకుంది జహర్‌తాజ్.
జహర్‌తాజ్‌ది వైయస్‌ఆర్ జిల్లాలోని పోరుమామిళ్ల. తండ్రి, తాత స్ఫూర్తితో చిన్నతనం నుంచే సరదాగా రైఫిల్ చేత పట్టింది. షూటింగ్ పట్ల కుమార్తె తపనను అర్థం చేసుకున్నారు ఆమె తల్లిదండ్రులు. తన శిక్షణ కోసమనే గతేడాది ప్రొద్దుటూరుకు మకాం మార్చారు. షూటింగ్ నేర్చుకునే అవకాశం ఉండటంతో జహర్‌తాజ్.. పూజా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చేరింది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది.
యువత 'బిజీ'నెస్! మేనేజ్‌మెంట్ కోర్సుల దిశగా అడుగులు - ప్రపంచస్థాయిలో అపార అవకాశాలు
తాత, తండ్రి పర్యవేక్షణలో చిన్నప్పటి నుంచే నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడంలో నైపుణ్యం సంపాదించుకుంది జహర్‌తాజ్. ఇప్పుడు ప్రత్యేక శిక్షణ పొందుతూ ప్రతిభకు మరింత పదును పెట్టుకుంది. ఒకపక్క నేర్చుకుంటూనే.. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొనేది. వరుస పతకాలు ఖాతాలో వేసుకుని.. జాతీయ స్థాయి పోటీలకూ అర్హత దక్కించుకుంది.
Rifle Shooter Sk Jahaer Taj:ప్రొద్దుటూరుకు చెందిన రాఘవ, పీటీ రామాంజి ఆధ్వర్యంలో మెళకువలు నేర్చుకుంటోందీ అమ్మాయి. తల్లిదండ్రుల ప్రోద్బలంతో, సంకల్పంతో తొందరగానే షూటింగ్‌పై మంచి పట్టు సొంతం చేసుకుంది. 2022లో హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని.. బంగారు పతాకాన్ని గెల్చుకుంది జహర్‌తాజ్. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన పోటీల్లో.. పాల్గొని రజతం సాధించింది. దీంతో భోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పోటీపడే అవకాశమూ అందుకుంది.
'ఫ్యాషన్ డిజైనింగ్‌లో నంబర్ వన్' సామాజిక అంశాలపై ఆసక్తి కొద్దీ మరో లక్ష్యానికి చేరువైన తులసి
ప్రస్తుతం జహర్‌తాజ్ తండ్రి అస్సాంలో విధులు నిర్వహిస్తుండటంతో.. తల్లి వెన్నంటే నిలిచి కుమార్తెకు అడుగడుగునా ప్రోత్సాహమందిస్తోంది. ఒకపక్క చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూనే.. షూటింగ్‌నూ శ్రద్ధగా సాధన చేస్తూ.. పాల్గొన్న చోటల్లా పతకాలు సాధించడం గర్వంగా ఉందంటున్నారు జహర్‌తాజ్ ఉపాధ్యాయులు. తనకెంతో ఇష్టమైన రైఫిల్ షూటింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తానంటోంది జహర్‌తాజ్. అలాగే డాక్టర్ కావాలనేది తన కోరికని.. అందుకే చదువునూ ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయననీ చెబుతోంది.
"మా తాత, నాన్నను చూసి నేను కూడా రైఫిల్ షూటింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో నేను ప్రొద్దుటూరుకు చెందిన రాఘవ, పీటీ రామాంజి ఆధ్వర్యంలో మెళకువలు నేర్చుకుంటున్నాను. 2022లో హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని.. బంగారు పతాకాన్ని గెల్చుకున్నాను. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన పోటీల్లో.. పాల్గొని రజతం సాధించాను. దీంతో భోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పోటీపడే అవకాశం దక్కింది" - షేక్ జహర్ తాజ్, రైఫిల్ షూటింగ్ క్రీడాకారిణి
అంతర్జాతీయ జల సదస్సులో 'ఫ్లాష్ మాబ్' - ప్రతినిధుల మెప్పు పొందిన 'ఆంధ్ర' విద్యార్థుల మైమ్