కడప మామిళ్లపల్లె ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారిస్తోంది. పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. పేలుడు ఘటనపై కడప జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్ సేఫ్టీ, ఎక్ల్ ప్లోజివ్స్ శాఖలకు చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.
మామిళ్లపల్లె ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ - కడప మామిళ్లపల్లె ఘటన అప్ డేట్స్
కడప మామిళ్లపల్లె పేలుళ్ల ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ కొనసాగుతోంది. పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు.

మామిళ్లపల్లె ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ
మామిళ్లపల్లె శివారులోని తిరుమల కొండ సమీపంలో ఉన్న బైరటీస్ గనుల వద్ద జిలెటిన్‌స్టిక్స్ పేలడంతో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గనికి వాహనంలో జిలెటిన్ స్టిక్స్ తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: మళ్లీ పెట్రో బాదుడు- లీటరు రూ.100!