Hero Vishal visited Kadapa Pedda Darga : తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సినీ హీరో విశాల్ కడప పెద్దదర్గాను దర్శించుకున్నారు. అమీన్ పీర్ దర్గాకు వచ్చిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూలచాదర్ సమర్పించారు. దర్గా మత పెద్దలు.. అమీన్ పీర్ దర్గా విశిష్టతను హీరో విశాల్ కు తెలియజేశారు. తొలిసారిగా తాను కడప పెద్దదర్గాను దర్శించుకుని ఆత్మసంతృప్తి పొందానని విశాల్ చెప్పారు. గతంలో సినిమా షూటింగ్ సందర్భంగా కడపకు వచ్చినప్పటికీ పెద్దదర్గాను దర్శించుకోవడం కుదరలేదని.. కడపకు వచ్చిన ప్రతిసారి ఏదో తెలియని ధైర్యం, ఆత్మశాంతి కల్గుతుందన్నారు. దీపావళి పండుగకు పటాసులు కాల్చడం కంటే.. ఆ డబ్బులతో పేదలకు సాయం చేయడం మంచిదని విశాల్ విజ్ఞప్తి చేశారు. తాను ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నానన్న ఆయన.. తన లాఠీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందని తెలిపారు.
Hero Vishal: కడప పెద్దదర్గాను దర్శించుకున్న హీరో విశాల్.. - VISHAL VISIT PEDDA DARGA IN KADAPA
Tamil hero Vishal: సినీ నటుడు విశాల్.. కడపలోని పెద్దదర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గతంలో కడపకు వచ్చినప్పటికీ.. పెద్ద దర్గాను దర్శించుకోవడం కుదరలేదని.. ఇపుడు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడానికే వచ్చానని ఆయన పేర్కొన్నారు. తాను నటించిన లాఠీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందని విశాాల్ తెలిపారు.

తమిళ హీరో విశాల్
కడప పెద్దదర్గాను దర్శించుకున్న తమిళ హీరో