BHARATEEYUDU 2 SHOOTING: సినీ కథానాయకుడు కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో భారతీయుడుకు కొనసాగింపుగా రూపొందుతున్న భారతీయుడు-2 చిత్రీకరణ గండికోటలో శరవేగంగా జరుగుతోంది. కోట ముఖద్వారం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్‌లో బ్రిటీషు కాలంలో కూరగాయల, పశువుల కొనుగోలు ప్రాంతంలో ప్రజలపై పోలీసులు దాడి చేస్తుంటే కమల్‌హాసన్ అక్కడి చేరుకుని వారిపై తిరుగుబాటు చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
కడప గండికోటలో భారతీయుడు-2.. పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ - భారతీయుడు 2 చిత్రీకరణ
KAMAL HASSAN MOVIE SHOOTING : ప్రముఖ హీరో కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ రెండోరోజు జరిగింది. వైఎస్సార్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
BHARATEEYUDU 2 SHOOTING
సుమారు ఫిబ్రవరి 4వ తేదీ వరకు గండికోట పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఆ మేరకు కమల్‌హాసన్‌ను ప్రత్యేక హెలీకాప్టర్‌లో తిరుపతి నుంచి గండికోటకు చేరుకునేలా చిత్రబృందం ఏర్పాట్లు చేసుకుంది. గండికోట హరిత హోటల్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద కమలహాసన్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. శంకర్ ప్రస్తుతం ఇటు కమల్‌హాసన్‌తోనూ, అటు రామ్‌చరణ్‌తోనూ సమాంతరంగా రెండు సినిమాల్ని చేస్తున్నారు.
ఇవీ చదవండి: