నాబార్డ్ సహకారంతో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కడప అక్కయ్యపల్లెలోని కార్యాలయ ఆవరణంలో మహిళలకు జనపనారతో బ్యాగుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. పదిహేను రోజులపాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఈ శిక్షణలో స్కూల్, బట్టల బ్యాగులు, మహిళల హ్యాండ్ బ్యాగులు, క్యారీ బ్యాగుల తయారీ నేర్పిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. బ్యాగులకు మంచి డిమాండ్ ఉన్నందున రోజుకు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నారీ మహిళలు. చేతి వృత్తి కావడంతో ఎక్కడికి వెళ్ళినా బ్యాగులు కుట్టి నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చంటూ మహిళలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము తయారు చేసిన బ్యాగులు విక్రయించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుతున్నారీ మహిళామణులు.
చేతి సంచులు... తీర్చాయి చింతలు... - నాబార్డ్ వార్తలు
మహిళలు ఇంటికే పరిమితం కాకుండా నాలుగు డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో చేతివృత్తులపై దృష్టి సారిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధించడంతో జనపనార బ్యాగుల తయారీపై దృష్టి పెట్టి ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు కడప ఆడపడుచులు.
అక్కయ్య పల్లెలో మహిళలకు జనపనారతో బ్యాగుల తయారీపై శిక్షణ