కడప జిల్లాలోని కుందూనదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న నీటికితోడు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు తోడైన కారణంగా.. నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. కడప, కర్నూలు జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద 35వేల క్యూసెక్కులతో వరద ప్రవహిస్తోంది.
కుందూనదిలో నిలకడగా వరద ప్రవాహం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు తోడు విస్తారంగా వర్షాలు కురవడం.. కడప జిల్లాలో నదులన్ని ఉగ్రరూపం దాల్చాయి. కుందూనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
కుందూనదిలో నిలకడగా వరద ప్రవాహం