కడప జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుగ్గవంక ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. పదిరోజుల కిందట కురిసిన వర్షానికి బుగ్గవంకలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
బుగ్గవంక ప్రాజెక్టుకు భారీగా వరద నీరు - kadapa district latest news
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లాలోని బుగ్గవంక ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. నాలుగు గేట్లు ఎత్తడంతో పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేశారు.
బుగ్గవంక ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
ఇదీచదవండి