కార్తిక పౌర్ణమి సందర్భంగా కడప జిల్లా రాజంపేటలోని శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. మండలంలోని హత్యరాలలో వెలసిన కామాక్షిదేవి సమేత త్రేతేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమీపంలోని బహుద మడుగులో స్నానమాచరించి నీటిలో దీపాలను వదిలారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
గుండ్లూరులో వెలసిన అన్నపూర్ణదేవి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి పంచామృతాభిషేకాలను, పూజలను నిర్వహించారు. రాజంపేటలోని పర్వత వర్ధిని దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేకువజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.